Sunday, September 1, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 44

సుమతీ శతకం (Sumathi Shathakam) - 44

అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ.


భావం:-
అప్పుచేసి చేయు వేడుక, ముసలితనమందు పడుచు పెండ్లాము, మూర్ఖుడు చేయు తపస్సు, తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యము, సహింపరానివై తరువాత చెడు కలిగించును.-అంటున్నాడు బద్దెన.

No comments:

Post a Comment