Sunday, September 8, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 75

కృష్ణ శతకం (Krishna Shathakam) - 75

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో
హరి మిము దలచిన వారికి
నరుదా కైవల్య పదవి యత్యుత కృష్ణా


భావం:-
కృష్ణా!ఆశ్వ మేధ యాగము చేసిన వారికి ఏ పదవి దక్కునో, ఏమో గాని, మిమ్ము నమ్మి తలచిన వారికి మీ సాన్నిధ్యము[కైవల్యము] దక్కుట కష్టమా?కాదు. లభించియే తీరునని అర్ధము.కృష్ణ శతకం.

No comments:

Post a Comment