Sunday, September 8, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 74

కృష్ణ శతకం (Krishna Shathakam) - 74

వేదంబులు గననేరని
యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ
నాదిక్కు జూచి కావుము
నీదిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా


భావం:-
 ఓకృష్ణా! నీవు వేదములకు కూడా దొరకని వాడవు.ఆది పురుషుడవు.పాపరహితుడవు.మురాసురుని చంపినవాడవు.అట్టి నీచూపు నిన్నే నమ్ముకున్న నాపై ప్రసరింపజేసి నన్ను కాపాడు తండ్రీ! కృష్ణ శతకము.

No comments:

Post a Comment