Sunday, September 8, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 73

కృష్ణ శతకం (Krishna Shathakam) - 73

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా
విశ్వము జెరుపను హరుడవు
విశ్వాత్మక నీవెయనుచు వెలయుదు కృష్ణా


భావం:-
కృష్ణా! లోకములను అందలిజీవులను సృష్టించుటకు బ్రహ్మవు. అన్నిటినీ,అందరినీ రక్షించుటకు విష్ణుడవు.కడకు నశింపజేయుటకు శివడవు.అన్నీనీవేఅయి విశ్వమంతా నిండియున్నావు.

No comments:

Post a Comment