కృష్ణ శతకం (Krishna Shathakam) - 72
బలమెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకునీవు బలమౌ కృష్ణా
భావం:-
కృష్ణా! నువ్వు కరిరాజు గజేంద్రుడికి బలమై కాపాడావు. ద్రౌపదికి కౌరవులు మాన భంగం చేయు సమయములో చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడావు.సుగ్రీవునికి బలమయ్యావు.నాకూనీవు బలమౌతండ్రీ!

No comments:
Post a Comment