Sunday, September 8, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 70

కృష్ణ శతకం (Krishna Shathakam) - 70

పరుసము సోకిన ఇనుమును
వరుసగ బంగారమైన వడువున జిహ్వన్
హరి నీనామము సోకిన
సురవందిత నేను నటుల సులభుడ కృష్ణా


భావం:-
కృష్ణా! పరుసవేది తగిలితే ఇనుము బంగార మైనట్లు దేవతలచే స్తుతింపబడు నీనామ స్మరణ చేయుటవల్ల నేను నట్లే మోక్షము సులభాముగా పొందెదను. కృష్ణ శతకము.

No comments:

Post a Comment