Friday, September 6, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 57

కృష్ణ శతకం (Krishna Shathakam) - 57

నీనామము భవహరణము
నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్
నీనామ మమృత పూర్ణము
నీనామము నే దలంతు నిత్యము కృష్ణా


భావం:-
కృష్ణా! నీనామము భవ బంధాలను తెంచి మనసుకు శాంతినిస్తుంది. ఈజన్మలో కావలసిన సుఖముల నిస్తుంది. అమృతమువంటి నీనామమును నేను అనుదినమూ తలచుచుందును.కృష్ణ శతక పద్యము.

No comments:

Post a Comment