Friday, September 6, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 55

కృష్ణ శతకం (Krishna Shathakam) - 55

కొంచెపు వాడని మదిలో
కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ
యంచితముగ నీకరుణకు
గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా


భావం:-
 శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!-కృష్ణ శతకం.

No comments:

Post a Comment