Friday, September 6, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 54

కృష్ణ శతకం (Krishna Shathakam) - 54

కంటికి రెప్ప విధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీవుండుటనే
కంటక మగు పాపములను గడచితి కృష్ణా


భావం:-
శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం

No comments:

Post a Comment