Thursday, September 5, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 47

కృష్ణ శతకం (Krishna Shathakam) - 47

నందుని ముద్దులపట్టిని
మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు నినుదలతు భక్తవత్సల కృష్ణా


భావం:-
శ్రీకృష్ణా!నందునిముద్దులకొడుకుగా వెలసిననువ్వు మందరగిరినిఎత్తావు. సుందరుడవై మునులచే హరీ!మాధవా!విష్ణు అనికీర్తించబడ్డావు.అట్టినిన్ను భక్తులను కాపాడువాడవని తలచుచున్నాను.

No comments:

Post a Comment