Tuesday, September 3, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 45

కృష్ణ శతకం (Krishna Shathakam) - 45

క్రతువులు తీర్థాగమములు
వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ
పతి!మిము దలచినవారికి
నతులిత పుణ్యములు గలుగుటరుదా?కృష్ణా!


భావం:-
కృష్ణా!పుణ్యముల కొరకు తీర్థయాత్రలు, వ్రతాలు,దానాలు చేయాలా? లక్ష్మీపతివైన నిన్ను తలచిన చెప్పనలవికానన్ని పుణ్యములు కలగకపోవునా?కలుగుతాయికదా!

No comments:

Post a Comment