Saturday, September 7, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 63

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 63

బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో
జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్
జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న
జల్లునే వెన్నెలల్ జగము జీకటులన్నియు బాయ భాస్కరా


భావం:-
చంద్రుడున్నచో వెన్నెలకాయునేగాని నక్షత్రములెన్నున్న వెలుగులేనట్లే రాజువల్లే సభకు కాంతి.

No comments:

Post a Comment