Saturday, September 7, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 19

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 19

తరువు లతిరస ఫలభార గురుతగాంచు
నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు
డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము


భావం:-
నిండుగాపండ్లు ఉన్నవృక్షం వంగే ఉంటుంది.నీటిని నింపుకుని వర్షించే మేఘాలు కిందికి వంగే ఉంటాయి.సంపదలున్నా ఉపకార గుణమున్నవారు ఆహంకరించరు.భర్తృహరి సుభాషితములు.

No comments:

Post a Comment