Saturday, September 7, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 61

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 61

నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే
జగముననగ్నియైన గడుసన్నగిలంబడియున్న నింధనం
బెగయగద్రోచి యూదకమరెట్లు రగుల్కొననేర్చు భాస్కరా


భావం:-
నిప్పుదిగజారినప్పుడు కట్టెలెగదోసిఊదితే మండుతుంది.గొప్పవాడు ధనము పోయినపుడు చేరదీసిపోషించిన తేరగలడు.

No comments:

Post a Comment