Friday, September 6, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 58

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 58

మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా
వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా
లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే
వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేను భాస్కరా


భావం:-
ఎవరికైనాపాపఫలము మరుజన్మలోనైన అనుభవించాలీ.రాముడు చెట్టుచాటునుండీవాలినిచంపిన పాపము కృష్ణునిగా బోయవానిచే చంపబడెను.

No comments:

Post a Comment