వేమన శతకం (Vemana Shatakam) - 90
త్రాడు పామటుంచు దాజూచి భయపడు
దెలిసి త్రాడటన్న దీరు భయము
భయము తీరినపుడె బ్రహ్మ్హంబు తానగు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఏ విధంగా త్రాడుని చూసి పాము అని భయపడిన వానికి అది త్రాడు అని తెలియగానే భయము తీరిపోతుందో, అదే విధంగా భ్రాంతి నశించి భయము తీరినపుడే బ్రహ్మము అనేది ఏమిటో తెలుస్తుంది. కాబట్టి అసలు ఏదైనా సాధించాలంటే భయాన్ని పారదోలాలి. భయము నిండిన మనసులో విచక్షణా ఙానము ఉండదు.

No comments:
Post a Comment