Wednesday, August 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 89

వేమన శతకం (Vemana Shatakam) - 89

కాలమధికమైన గడిచిపోవగరాదు
ధర్మరాజు కొల్చె దగనిచోట
కంకుభట్టనంగ గటకటా! యేమందు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కాలగతిని తప్పించడము ఎవరికి సాధ్యము కాదు. మనకు అలవి రాని సమయములో కాసింత అణిగి ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ధర్మరాజు అంతడివాడు సైతం కంకుభట్టుగా మారి, తనకంటే తక్కువ వానిని సేవింపగ తప్పలేదు కదా! కాబట్టి సమయాన్ని బట్టి ఆచరించడం వివేకవంతుని లక్షణం.

No comments:

Post a Comment