Wednesday, August 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 88

వేమన శతకం (Vemana Shatakam) - 88

తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల
నట్టి యూరువిడిచి యవలబోరె?
కొలకు లెండినంత గొక్కెరలుండునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఎలాగైతే ఎండిన చెరువులోనుంచి కొంగలు తరలి వెల్లిపోతాయో, అలానే కరువు వచ్చిన ఊరుని విడిచి వెల్లిపోవడం ఉత్తమం. బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.

No comments:

Post a Comment