కృష్ణ శతకం (Krishna Shathakam) - 21
మగ మీనమువై జలధిని
పగతుని సోమకుని జంపి పద్మ భవునకు
న్నిగమముల దెచ్చి యిచ్చితి
సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!
భావం:-
మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం.
ప్రతిపదార్థం:-
సుగుణాకరా అంటే మంచి గుణములకు నెలవైనవాడా; దివ్యసుందర అంటే దైవసంబంధమైన సౌందర్యం కలవాడా; ఓ కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీవు అంటే నువ్వు; జలధిని అంటే నీటికి నిధి అయిన సముద్రంలో; మగమీనమువై అంటే మగచేపవై (మీనావతారం); పగతుని అంటే శత్రువు అయిన; సోమకుని అంటే వేదాలను దొంగిలించిన సోమకుడనే రాక్షసుడిని; చంపి అంటే వధించి; పద్మభవునకున్ అంటే పద్మమునుండి పుట్టిన బ్రహ్మకు; నిగమములన్ అంటే వేదాలను; తెచ్చి యిచ్చితి అంటే తెచ్చిఇచ్చావు; మేలు అంటే ఎంత ఆశ్చర్యం!
చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు.

No comments:
Post a Comment