Tuesday, August 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 83

వేమన శతకం (Vemana Shatakam) - 83

చంప దగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు!
విశ్వదాభిరామ వినురవేమ.


తాత్పర్యము :-
తనను చంపతగినంత కీడు చేసిన శత్రువే అయినా - ఆపదలో సాయం కోరి వస్తే, అలాంటి వారికి హాని తలపెట్టరాదు. చేతనయినంత సాయం చేసి పంపడం మంచిది. అదే అతనికి తగిన శిక్ష. సమాజానికి ఈ క్షమాగుణం ఎంతో అవసరము.

No comments:

Post a Comment