Tuesday, August 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 82

వేమన శతకం (Vemana Shatakam) - 82

అనువు గాని చోట అధికులమనరాదు
కొంచె ముండు టెల్ల కొదువ గాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా?
విశ్వదాభిరామ వినురవేమ.


తాత్పర్యము :-
తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా!

No comments:

Post a Comment