వేమన శతకం (Vemana Shatakam) - 80
పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను
వృక్షము పదమూడు విత్తులయ్యె
విత్తులందు నుండు వృక్షమాలించుమీ!
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము :-
పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటి పద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు.
పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం.
వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగ భాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు.

No comments:
Post a Comment