Tuesday, August 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 79

వేమన శతకం (Vemana Shatakam) - 79

వేయి విధములమర వేమన పద్యముల్
అర్థమిచ్చువాని నరసి చూడ
చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినురవేమ


భావం :
ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ Thousand interpretations అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను If thou think on these, this shall produce refined wisdom in thee అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు.

‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైన అలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు.

ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది.

లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం.

No comments:

Post a Comment