వేమన శతకం (Vemana Shatakam) - 70
కడక నఖిలమునకు నడి నాళమందున్న
వేగుచుక్క వంటి వెలుగు దిక్కు
వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే.
ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం.
ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడ-పింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు.
ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది.
ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు.
మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు.
సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్).
జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం.
జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం.

No comments:
Post a Comment