వేమన శతకం (Vemana Shatakam) - 69
ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు
మొదల పట్టుబట్టి వదలరాదు
మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం.
ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము).
పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ.
భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది.
చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది.
అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత.

No comments:
Post a Comment