వేమన శతకం (Vemana Shatakam) - 68
కడుపుకేల మనస! కళవళ పడియెదు
కడుపుకేల తృప్తి కలుగుచుండు
కడుపు రాతిలోని కప్పకు గలుగదా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన.
రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం.
కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం.
ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది.
అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం.

No comments:
Post a Comment