వేమన శతకం (Vemana Shatakam) - 65
చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు
కడకు మొదటి కులము చెడినయట్లు
పాపమొకటి గలదు ఫలమేమి లేదయా!
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం:
అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన.
‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని.
ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు.
ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది.
చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం.

No comments:
Post a Comment