వేమన శతకం (Vemana Shatakam) - 63
బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు
ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ
ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం:-
ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు.
భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన.
బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది.
ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం.

No comments:
Post a Comment