వేమన శతకం (Vemana Shatakam) - 62
చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె
నీటబడ్డ చినుకు నీళ్ళగలసె
ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా తయారవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే ఒక నీటి బొట్టై తన అస్థిత్వాన్నె కోల్పోతుంది. అదే విధంగా మనకు ప్రాప్తం ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది.

No comments:
Post a Comment