Saturday, August 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 59

వేమన శతకం (Vemana Shatakam) - 59

ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని
పిన్న పెద్దతనము నెన్నబోరు
వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి.

No comments:

Post a Comment