Saturday, August 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 58

వేమన శతకం (Vemana Shatakam) - 58

కనకమృగము భువిని కద్దు లేదనకనే
తరుణి విడిచిపోడె దాశరథియు
దైవమైన ధనము దలచుచుండునుగాదె?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు.

No comments:

Post a Comment