Friday, August 23, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 56

వేమన శతకం (Vemana Shatakam) - 56

ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి
వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు
కుక్కతోకబట్టి గోదావరీదును
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే.

No comments:

Post a Comment