ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక
డీకొని చలముననె దీర్చెనేని
ఎలుగు దివిటిసేవకేర్పడు చందము
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి.
No comments:
Post a Comment