Monday, August 12, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 36

వేమన శతకం (Vemana Shatakam) - 36

చురికితోడగోయ జొప్పడునేకాని
దానిపిడినిగోయ దరమె నీకు?
తెలివిలేనిమేని బలమేమి చేయును?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దేన్నైన కోయాలంటే కత్తితో చేయాలికాని దాని పిడితో చేయలేము. పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కాని కోయడానికి కాదు. అదే విధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కాని దేహ బలంతో ఏమి చేయలేము. దేహము మనకు పిడిలాంటిది మాత్రమే.

No comments:

Post a Comment