Wednesday, August 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 27

వేమన శతకం (Vemana Shatakam) - 27

కూలినాలిచేసి గుల్లాము పనిచేసి
తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు
లేమిజిక్కు విభుని వేమారు తిట్టును
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి.

No comments:

Post a Comment