Friday, August 2, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 21

వేమన శతకం (Vemana Shatakam) - 21

హయమదరి పరువులిడుగతి
రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా
నయమో భయమో చూపుచు
బయనము సాగింపనీక పట్టర వేమ!


భావం:-
గుర్రము దారి తప్పు పరిగెడుతుంటే దానిని నయానో భయానో అదుపులోకి తెచ్చి సరి అయిన దారిలో పెడతాము. అలాగే చంచలమైన మనస్సుని సాధనతో స్థిరపరచి సరి అయిన దారిలోకి మళ్ళించాలి.

No comments:

Post a Comment