Friday, August 2, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 20

వేమన శతకం (Vemana Shatakam) - 20

అఱుత లింగముండ నదియెఱుంగగలేక
పర్వతంబుబోవు బానిసీడు
ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు.

No comments:

Post a Comment