Friday, August 2, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 17

సుమతీ శతకం (Sumathi Shathakam) - 17

సిరిదా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!


భావం :-
ఓ బుద్ధిమంతుడా!
ఎవరికైనా సరే సంపదలు ఏ విధంగా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఎలాగంటే కొబ్బరికాయలోకి తియ్యటి నీళ్లు ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ధనం అదేవిధంగా వస్తుంది. అలాగే వెలగపండులో ఉన్న గుజ్జు మాయమైపోయి కాయ మాత్రం చక్కగా ఉంటుంది. బయట నుంచి చూస్తే అది గుజ్జు నిండిన కాయలాగే ఉంటుంది. ఎక్కడా రంధ్రం కాని పుచ్చుకాని ఉండదు. అయితే అందులోకి కరి అనే ఒకరకమైన పురుగు చేసి లోపల ఉన్న గుజ్జు తినే సి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కరి అనే ఒకరకమైన వ్యాధి వచ్చినప్పుడు లోపల గుజ్జు పోతుందని మరికొందరు చెప్తారు. ఏది ఏమైనా వెలగపండులో ఉన్న గుజ్జు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా ఒకవ్యక్తి దగ్గర నుంచి ధనం కూడా అలాగే వెళ్లిపోతుంది. ఇందులో బద్దెన లోకంలో ఉన్న వాస్తవాన్ని తీసుకుని ధనం ఎలావచ్చిపోతుందో వివరించాడు. నారికేళమంటే కొబ్బరికాయ, సలిలమంటే నీరు, కరి అంటే ఏనుగు, భంగిన్ అంటే విధంగా అని అర్థం.

No comments:

Post a Comment