వేమన శతకం (Vemana Shatakam) - 19
ఊపబోయి కొంత యూగించి విడిచిన
నూగుగాని గమ్య మొందలేరు
పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు.

No comments:
Post a Comment