Thursday, August 1, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 3

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 3

ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము
డివ్విధమున విచారించి యెడల దెగిన
జనములకు దాపమొందరు సాధుజనులు


తాత్పర్యం:-
చెట్లు నరికిన చిగురిస్తాయి.చంద్రుడు క్షీణించి తిరిగి పెరుగుతాడు.అట్లే లోకములో మంచి స్వభావము గలవారు మిక్కిలి కష్టాలను పొందినా ధైర్యముతో నిలబడతారు.

No comments:

Post a Comment