Saturday, August 31, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 40

సుమతీ శతకం (Sumathi Shathakam) - 40

వేసరపు జాతికానీ
వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ
దాసికొడుకైనం గానీ
కాసులుగలవాడె రాజుగదరా సుమతీ


భావం:-
తక్కువజాతి వాడైననూ, కొంచెమైన తెలివిలేని ప్రయోజనము లేనివాడైననూ, దాసీదాని కొడుకైననూ డబ్బు గలవాడు గొప్పవాడుగా నాయకుడుగా పేరుపొందుతూ ఉంటాడు.కోట్లుంటేనే కోటలో పాగా వెయ్యగలడు

No comments:

Post a Comment