సుమతీ శతకం (Sumathi Shathakam) - 34
ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్
మడువున గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
భావం :-
ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది.
ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి.
ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి.

No comments:
Post a Comment