సుమతీ శతకం (Sumathi Shathakam) - 32
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
భావం:-
మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది.
ప్రతిపదార్థం:-
ఇమ్ముగన్ అంటే బాగుగా. చదువని అంటే చదువుకోని. నోరును అంటే నోరు. అమ్మా + అని అంటే తల్లీ అని పిలిచి. అన్నము అంటే అన్నం పెట్టమని. అడుగని అంటే కోరనటువంటి. నోరున్ అంటే నోరు. తమ్ములన్ అంటే తనకంటె చిన్నవారైన సోదరులను. పిలువని అంటే ప్రేమగా దగ్గరకు రమ్మనమని. నోరును అంటే నోటిని. కుమ్మరి అంటే కుండలు చేసేవాని. మను అంటే మన్ను. త్రవ్వినట్టి అంటే తవ్విన తరువాత ఏర్పడిన. గుంటర అంటే చిన్నగోతితో సమానం.
మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.

No comments:
Post a Comment