సుమతీ శతకం (Sumathi Shathakam) - 29
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము,
జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
భావం: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు.
బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు.
ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు.

No comments:
Post a Comment