సుమతీ శతకం (Sumathi Shathakam) - 25
పాలసునకైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
దేలగ్ని బడగ బట్టిన
మేలె ఱుగునె మీటుగాక మేదిని సుమతీ!
భావం:-
చెడుస్వభావం కలవాడు ఆపదలలో చిక్కుకున్నప్పుడు, అన్నీ తెలిసిన జ్ఞాని జాలిపడి, దుర్జనుడిని ఆపద నుంచి రక్షించడానికి ప్రయత్నించకూడదు. తేలు మంటలో పడినప్పుడు జాలిపడి, దానిని చేతితో పైకి తీసి పట్టుకుంటే, అది కుడుతుందే కాని, తనను రక్షించాడు కదా అని కుట్టకుండా ఉండదు.
‘అపాత్రదానం’ అనే నానుడి వాడుకలో ఉంది. ఎప్పుడైనా అవసరంలో ఉన్నవారికి దానం చేస్తే దాని ఫలితం ఉంటుంది. అంతేకాని, అడిగిన వారికల్లా దానం చేస్తూ ఉంటే ఆ దానం దురుపయోగం అవుతుంది. మనిషికైనా, జంతువుకైనా, పక్షికైనా... దేనికైనా దాని సహజస్వభావం ఉంటుంది. అది పుట్టుకతో వస్తుంది. పుడకలతోనే పోతుంది. అందువల్ల చెడుస్వభావం ఉన్నవారిని రక్షించినందువల్ల మిగిలినవారికి కూడా చెడు జరుగుతుందే కాని వారివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, అని కవి ఈ పద్యంలో వివరించాడు.
పాలసునకున్ అంటే చెడుస్వభావం కలవానికి; ఐన + ఆపదన్ అంటే కష్టం లేదా విపత్తు కలిగినప్పుడు; జాలిన్ +పడి అంటే జాలి వహించి, కనికరంతో; తీర్పన్ అంటే ఆపదను పోగొట్టటం; సర్వజ్ఞునకున్ అంటే అన్నీ తెలిసినవానికి; తగదు అంటే అంటే మంచిదికాదు; మేదినిన్ అంటే ఈ భూమి మీద; తేలు అంటే తోకలో విషం కలిగి ఉండిన వృశ్చికం; అగ్నిన్ అంటే మంటలో; పడన్ + కన్ అంటే పడిపోయినప్పుడు; పట్టినన్ అంటే దానిని చేతితో పట్టుకొంటే; మీటున్ + కాక అంటే కుడుతుందే కాని; మేలు+ ఎరుగును + ఏ అంటే చేసిన సహాయాన్ని గుర్తిస్తుందా?(గుర్తించదు)

No comments:
Post a Comment