Sunday, August 25, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 16

కుమార శతకం (Kumara Shatakam) - 16

తనపై దయ నూల్కొనఁగను
గొన నేతెంచినను శీల గురుమతులను వం
దనముగఁ బూజింపం దగు
మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!


తాత్పర్యం:
ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని.

No comments:

Post a Comment