Thursday, August 22, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 13

కుమార శతకం (Kumara Shatakam) - 13

వృద్ధజన సేవ చేసిన,
బుద్ధి వివేషజ్ఞుడనుచు బూతచరితుడున్
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధర బొగడెదరు ప్రేమ యెసగ కుమారా !


భావము:-
పెద్దలను భక్తితో గొలుచుచున్న ఎడల వానిని లోకమునందు, పరిశుద్ధముగ మనస్సు కలవాడనియు, తెలివితేటలు బాగుగ నుండువాడనియు, ధర్మముల నెరింగినవాడనియు పెద్దలగువారందురు. 

No comments:

Post a Comment