Saturday, August 31, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 32

కృష్ణ శతకం (Krishna Shathakam) - 32

వనజాక్ష భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై
కననీ సద్గుణజాలము
సనకాదిమునీంద్రు లెన్నజాలరు కృష్ణా!


భావం:-
కృష్ణా!భక్తులనురక్షించువాడా!గొప్పవారైన త్రిమూర్తులలో కరుణామూర్తివైననీ సద్గుణాలను సనకాది మునీంద్రులుసహితము నిన్నుస్థుతించలేరు.ఇకనిన్ను స్తుతించుటకు నేనెంతటివాడను?

No comments:

Post a Comment