Friday, August 30, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 28

కృష్ణ శతకం (Krishna Shathakam) - 28

వలపుల తేజీనెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!


ప్రతిపదార్థం:-
కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నువ్వు; వలపు తేజీని అంటే ఆనందాన్ని కలిగించే గుర్రాన్ని; ఎక్కి అంటే అధిరోహించి; ఇలపై అంటే ఈ భూమి మీద; ధర్మమును అంటే వేదాలు చెప్పిన మంచి మార్గాన్ని బోధించే ధర్మాన్ని నిలబెట్టడానికి; హీనులన్ అంటే చెడు స్వభావం కలవారిని; తునుమన్ అంటే చంపటానికి; కలియుగము తుదిన అంటే యుగాలలో నాలుగవది అయిన కలియుగం అంతమయ్యే సమయంలో; వేడుకన్ అంటే వినోదంగా; కలికివిగా + ఉన్న అంటే కలికి అవతారంగా ఉండి; లోకకర్తవు అంటే లోకాలను సృష్టించేవాడివి.


భావం:-
భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు.

No comments:

Post a Comment