కృష్ణ శతకం (Krishna Shathakam) - 27
ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ రేవతీపతి
యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!
ప్రతిపదార్థం:-
కృష్ణా అంటే ఓ కృష్ణా; తగన్ అంటే తగినవిధంగా; భుజశక్తిన్ అంటే బాహుబలంచేత; ఘనులు + అగు అంటే అంటే గొప్పవారిగా పేరుపొందిన ; ధేనుక ముష్టిక అంటే ధేనుకుడు, ముష్టికుడు అనే పేర్లు గల; దనుజులన్ అంటే రాక్షసులను; చెండాడితివి అంటే చంపావు; ఔరా అంటే ఆహా; అనఘ + ఆత్మ అంటే పాపము లేని మనసు కలవాడా; రేవతీపతి + అనగ అంటే రేవతీదేవి భర్తగా పిలువబడి; బలరామమూర్తివి అంటే బలరామావతారం; అయితివి అంటే ధరించావు.
భావం:-
ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి.
నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు.

No comments:
Post a Comment